పద్యకవి వెంకట్ కు సన్మానం
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ కు చెందిన ప్రముఖ పద్యకవి డా బి వెంకట్(Poet Venkat) హైదరాబాదులో శతావధాన ప్రాశ్నిక సన్మానం అందుకున్నారు. హైదరాబాదులోని బేగంపేట పుష్పగిరి మహాసంస్థానంలో శ్రీ కోల్చారం మల్లినాథసూరి వేదికపై వినాయక నవరాత్రోత్సవాలు, పుష్పగిరి జగద్గురు మహా సంస్థానం పీఠాదీశ్వరుల చాతుర్మాస్యదీక్ష సందర్భంగా దర్శనమ్ ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక సభక్తికంగా శతావధాని ఆముదాల మురళీ సంచాలకత్వములో, అవధాన కళా కౌముది శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల సాహిత్ ప్రథమ శతావధానములో పుష్పగిరి జగద్గురు మహాసంస్థానం పీఠాదీశ్వరులు శ్రీశ్రీశ్రీ అభినవోద్దండ విద్యా శంకర భారతీస్వామి, దర్శనమ్ ప్రధాన సంపాదకులు మరుమాముల వేంకటరమణశర్మ, అవధాన విద్యా వికాస పరిషత్ వ్యవస్థాపకులు మరుమాముల దత్తాత్రేయ శర్మ, గురుసహస్రావధాని డా కడిమెళ్ళ వరప్రసాద్, అచ్చ తెలుగు శతావధాని డా పాలపర్తి శ్యామలనంద ప్రసాద్, సినీ హాస్యనటుడు తనికెళ్ళ భరణి, మహాసహస్రావధాని గరికపాటి నరసింహారావు, చేతులమిదుగా ప్రాశ్నిక సన్మానము, శతావధాన ప్రతిభా పత్రమును అందుకున్నారు. సన్మానం అందుకున్న వెంకట్ కు నిర్మల్ కవులు అభినందనలు తెలిపారు. సాహిత్య రంగంలో చేసిన కృషికి ఈ సన్మానం దక్కించుకున్నారు.