మహిళా మోర్చ జిల్లా ట్రెజర్ గా శ్రావణి
29-10-2026 | 11:46pm
చెన్నూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Manchiryala District) మహిళా మోర్చ ట్రెజర్(Mahila Morcha Treasurer) గా చెన్నూర్ పట్టణానికి చెందిన ముత్యాల శ్రావణి నియామకం అయ్యారు. పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటు , పార్టీకి విధేయతతో పని చేస్తున్న శ్రావణి సేవలను గుర్తించి జిల్లా స్థాయిలో సముచిత స్థానం కల్పించడం పట్ల చెన్నూర్ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. తనపై నమ్మకంతో జిల్లా ట్రెజర్ గా నియమించిన అధిష్టానానికి, శ్రావణి కృతజ్ఞతలు తెలిపారు.