గ్లోబల్ ఎడ్జ్ ఆధ్వర్యంలో యూఏఈ ప్రాపర్టీ ఎక్స్ పో

29-10-2026 | 11:38pm

హైదరాబాద్: యూఏఈకి చెందిన గ్లోబల్ ఎడ్జ్ అడ్వర్టైజ్‌మెంట్స్ ఎల్‌ఎల్‌సీ ఆధ్వర్యంలో యూఏఈ ప్రాపర్టీ గ్రాండ్ ఎక్స్ పో(UAE Property Grand Expo) 2026 అక్టోబర్ 31, నవంబర్ 1 తేదీల్లో హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్స్ అండ్ ట్రేడ్ ఫెయిర్స్‌లో జరగనుంది. దుబాయ్, అజ్మాన్ ప్రాంతాల్లోని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను భారతీయ పెట్టుబడిదారులకు పరిచయం చేయడంతో పాటు, ఆయా సంస్థల ప్రతినిధులతో నేరుగా చర్చించే అవకాశాన్ని కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.

ఈ ఎక్స్‌పోకు దుబాయ్ ల్యాండ్ డిపార్ట్‌మెంట్, అజ్మాన్ ల్యాండ్ డిపార్ట్‌మెంట్ మద్దతు అందిస్తున్నాయి. యూఏఈ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో కొనసాగుతున్న లావాదేవీలు, విదేశీ ఆస్తులపై భారతీయ పెట్టుబడిదారుల్లో పెరుగుతున్న ఆసక్తి నేపథ్యంలో ఈ కార్యక్రమం ప్రాధాన్యం సంతరించుకుంది. నిర్వాహకులు అందించిన అంచనాల ప్రకారం, దుబాయ్‌లోని రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లో భారతీయుల వాటా సుమారు 20–22 శాతంగా ఉంది. భారతీయ పెట్టుబడులు ఏటా AED 30 బిలియన్లకు పైగా ఉంటున్నాయి. 2025లో దుబాయ్ రియల్ ఎస్టేట్ లావాదేవీల విలువ సుమారు AED 917 బిలియన్లకు చేరినట్లు కార్యక్రమానికి సంబంధించిన మీడియా వివరాల్లో పేర్కొన్నారు.

సాంకేతిక రంగం, ఆరోగ్య సేవలు, వ్యాపారవేత్తల సంఖ్యలో వృద్ధి, అంతర్జాతీయ మార్కెట్లతో సంబంధాలున్న నిపుణుల సమూహం హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో విదేశీ రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై ఆసక్తి చూపుతున్న వారికి వివిధ ప్రాజెక్టులను పరిశీలించే వేదికగా ఈ ఎక్స్‌పో నిలవనుంది. పాల్గొనే డెవలపర్లతో నేరుగా మాట్లాడి, వేర్వేరు ధరల శ్రేణుల్లో అందుబాటులో ఉన్న నివాస ప్రాజెక్టులు, చెల్లింపు విధానాలు, కొనుగోలు ప్రక్రియల గురించి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

2010లో స్థాపించబడిన గ్లోబల్ ఎడ్జ్, గత 15 ఏళ్లకు పైగా యూఏఈలో ప్రకటనలు, మార్కెటింగ్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గ్లోబల్ ఎడ్జ్ అడ్వర్టైజ్‌మెంట్స్ ఎల్‌ఎల్‌సీ సీఈఓ మిస్టర్ రఘు పెలక్కట్ మాట్లాడుతూ, “అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు యూఏఈ ఒక ముఖ్యమైన గమ్యస్థానంగా ఎదిగింది. వివిధ ధరల శ్రేణుల్లో ఆస్తులను పరిశీలించే అవకాశాలు అక్కడ ఉన్నాయి. యూఏఈ ప్రాపర్టీ గ్రాండ్ ఎక్స్ పో ద్వారా దుబాయ్, అజ్మాన్ మార్కెట్లను హైదరాబాద్ పెట్టుబడిదారులకు చేరువ చేస్తున్నాం. డెవలపర్లతో ప్రత్యక్షంగా మాట్లాడటానికి, ప్రాజెక్టుల వివరాలను తెలుసుకోవడానికి, పెట్టుబడులపై స్పష్టమైన అవగాహన పొందడానికి ఈ వేదిక ఉపయోగపడుతుందన్నారు.

మరిన్ని వార్తలు