60 కూలీలు తగ్గకుండా మొటివేట్ చేయాలి

29-10-2026 | 11:52pm

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని విబిజి రామ్.జి పనుల గుర్తింపు గురించి మండల పరిషత్ కార్యాలయాన్ని డిప్యూటీ సీఈఓ సురేందర్(Deputy CEO Surender) సందర్శించారు. విబిజి రాంజీ పనుల(MGNREGA Works) గుర్తింపు, ఎల్ నినో(El Niño) మూలంగా కూలీలకు పని కల్పించుటకు, ఇంటింటికి ఇంకుడు గుంత, ఫామ్ పౌండ్, కమ్యూనిటీ సోప్ పిట్, రైన్ వాటర్ హార్వెస్టింగ్, ప్రతి గ్రామంలో వారికి అవసరమైన పనులను గుర్తించి ఆ పనులు కూలీల చేత చేయించవలనని ప్రతి గ్రామ పంచాయతీకి 60 కూలీలు తగ్గకుండా మొటివేట్ చేయించాలని తెలియజేశారు. ఈ ఎంపీఓ ప్రభాకర్ చారి, ఏపీవో సక్కుబాయి, సీనియర్ అసిస్టెంట్ ప్రకాష్, ఆపరేటర్ విజయకుమార్ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు