బాపూజీ వర్ధంతి వేడుకలు
21-09-2026 | 05:20pm
ఖానాపూర్ (విజయక్రాంతి): కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి(Death Anniversary of Konda Laxman Bapuji) వేడుకలను బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు యాటకారి సాయన్న జేఏసీ నేతలు బాపూజీ విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ కోరిన సామాజిక తెలంగాణను డాక్టర్ విశారదన్ మహరాజ్ నాయకత్వంలో తీసుకొచ్చి 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు.