22పైతప్పు ఒప్పుకున్నరు
- నిషేధిత జాబితా నుంచి భూములను ఎప్పుటిలోగా తొలగిస్తారు?
- మంత్రి పొంగులేటివన్నీ అబద్దాలే
- మా మామకు భూమి ఇచ్చింది కాంగ్రెస్.. ఎన్‌వోసీ కూడా కాంగ్రెస్ హయాంలోనే
- మాజీ మంత్రి హరీశ్‌రావు వెల్లడి
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి) : 22(ఏ) నిషేధిత భూముల జాబితా(List of prohibited lands)లో ప్రజల భూములను చేర్చిన విషయంపై ప్రభుత్వం తప్పు ఒప్పుకుందని, వాటిని జాబితా నుంచి ఎప్పటిలోగా తొలగిస్తారో స్పష్టం చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు(Former Minister Harish Rao) డిమాండ్ చేశారు. భవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి(Chief Minister) ఇంటి మాదిరిగానే.. సామాన్య ప్రజల ఆస్తులను కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరారు.
గత ప్రభుత్వ హయాంలోనే భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయంటూ మంత్రి పొంగులేటి తప్పించుకు నే ప్రయత్నం చేస్తున్నారని, అదే నిజమైతే ఇప్పుడు రిజిస్ట్రేషన్లు(Registrations) ఎందుకు నిలిచిపోయాయి? ప్రజలు ఎందుకు రోడ్లపైకి వచ్చారని హరీశ్‌రావు ప్రశ్నించారు. అసెంబ్లీలో మంత్రి పొంగులేటి అవాస్తవాలను పారించారని విమర్శించారు. రైతు ఆత్మహత్య చేసుకున్న ప్రాంతాన్ని తప్పుగా పేర్కొన్నారని వివరించారు. నాదర్గుల్, ఖాజాగూడ భూములు, ఫీనిక్స్ కంపెనీ ఒప్పందం, వట్టినాగులపల్లిలో వృద్ధ దంపతులపై దాడి వంటి అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పలేదని ఆరోపించారు.
భూ భారతి లోపాలపైనా హరీశ్‌రావు మండిపడ్డారు. చలాన్ చెల్లించకుండానే రిజిస్ట్రేషన్లు(Registrations) జరిగిన అంశంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో 11 లక్షల మంది రైతులకు సాదాబైనామాల కింద పట్టాలు ఇచ్చామని, ఆరు లక్షల ఎకరాలకు గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చామని తెలిపారు.
జీవో 76, జీవో 58, 59, జీవో 118 ద్వారా వివి ధ వర్గాలకు భూ హక్కులు కల్పించామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో డబ్బులు వసూలు చేస్తుందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs) అసెంబ్లీ(Assembly)లో ఉంటే ప్రభుత్వ అవినీతి, అక్రమాలు(Government corruption and irregularities) బయటపడతాయనే భయంతోనే తమను సస్పెండ్ చేశారని అన్నారు.
అన్నీ కాంగ్రెస్ హయాంలోనే!
తన మామ హనుమంతరావు పేరిట అసైన్డ్ భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్నారని మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలను హరీశ్‌రా వు ఖండించారు. ‘మా మామ కొండపాకలో భూమి కబ్జా చేశారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఆయన రిటైర్డ్ బ్యాంకు అధికారి. చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎక్స్ సర్వీస్‌మన్ సత్యనారాయణకు 1995లో అప్పటి ప్ర భుత్వం భూమి కేటాయించింది. 2010లో కాం గ్రెస్ ప్రభుత్వమే నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌వోసీ) ఇచ్చింది.
దాని ఆధారంగా మా మామ చెక్ ద్వారా డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. భూమి కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్వోసీ ఇచ్చిది, రిజిస్ట్రేషన్ చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ భూమికి ఎకరం రూ.15 కోట్లు అంటడు. రూ.50 లక్షలకు ఇస్తాం.. చెల్లించి రిజిస్రేష్టషన్ చేసుకోండి. కొండపాక నా నియోజకవర్గం కాదు. అది గజ్వేల్ నియోజకవర్గం. ఆ విషయం కూడా తప్పు చెప్పారు’ అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
నిరూపిస్తే రాజీనామా? : ఎమ్మెల్యే పల్లా
తన భూముల విషయంలో మంత్రి పొంగిలే టి చేసిన ఆరోపణలను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఖండించారు. రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, లేకపోతే పొంగులేటి రాజీనామా చేయాలని సవాల్ చేశారు. తనకున్నది ఎకరం 10 గుంటల భూమేనని, తెలంగాణ ఏర్పాటుకు ముందే అగ్రిమెంట్ జరిగిందని, అనంతరం రిజిస్ట్రేషన్ చేసుకున్నానని చెప్పారు. భూదాన్ భూమి కాదని 2008 లోనే కోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. 29 ఎకరాలు తనదేనని నిరూపించాలని, లేకపోతే పొంగులేటి రాజీనామా చేయాలన్నారు. కేసీఆర్, హరీశ్‌రావుపై పొంగులేటి చేసిన వ్యాఖ్యలు దుర్మార్గమని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.