పండిట్, పీఈటీ పోస్టుల అప్‌గ్రేడ్!
- సీఎం రేవంత్‌రెడ్డి అంగీకారం
- ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్‌రెడ్డి వెల్లడి
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): ఆశ్రమ పాఠశాల(Ashram School)ల్లో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పండిట్, పీఈటీ పోస్టుల అప్‌గ్రేడేషన్‌కు సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించినట్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్‌రెడ్డి(Pingali Sripal Reddy) తెలిపారు. శనివారం ఎమ్మెల్యే రాందాస్‌నాయక్(Ramdas Nayak)తో కలిసి ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి(Sripal Reddy).. అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. పండిట్, పీఈటీల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
దీనికి సీఎం సానుకూలంగా స్పందించారని, పోస్టుల అప్‌గ్రేడేషన్ త్వరితగతిన పూర్తి చేయటానికి అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని, తన కార్యదర్శి వేముల శ్రీనివాస్‌కు సూచించినట్లు శ్రీపాల్‌రెడ్డి తెలిపారు. ఆశ్రమ పాఠశాలల పండిట్, పీఈటీ ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను కలిసి వారిలో పీఆర్టీయూ టీఎస్ బాధ్యులు శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.