కోర్ అర్బన్ రీజియన్ బిల్లుకు ఆమోదం

13-09-2026 | 05:15am

శాసనమండలి నిరవధిక వాయిదా

హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రా ంతి): క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్) (Core Urban Region) బిల్లుకు తెలంగాణ శాసనమండలి ఆమోదం తెలిపిన అనంతరం మండలి నిరవధిక వాయిదా పడింది. హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చొంది.

ఒకే నగరం, ఒకే పరిపాలన, ఒకే చట్టం నినాదంతో క్యూర్ బిల్లు రూపొందించారు. ఈ బిల్లును శనివారం శాసనమండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై సభ్యులు చర్చించి ఆమోదం తెలిపారు. ఈ సభలో మొత్తం నాలుగు బిల్లులు ఆమోదం తెలపగా, ఆరు రోజుల పాటు మండలి పనిచేయగా, 19 గంటల 20 నిమిషాలు మండలి జరిగింది. 

మరిన్ని వార్తలు