కాంగ్రెస్‌కు కాదు.. పదవులకే రాజీనామా

13-09-2026 | 05:25am
  1. మాజీ సీఎం హరీశ్ రావత్
  2. ఉత్తరాఖండ్‌లో పీఏపై ఈడీ దాడుల నేపథ్యంలో ఎక్స్‌లో ప్రకటన

డెహ్రాడూన్, సెప్టెంబర్ 12: ఉత్తరాఖండ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హరీశ్ రావత్(Senior Congress leader Harish Rawat) ‘కాంగ్రెస్ కమిటీ కార్యవర్గం, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వాని తుడి పదవులకే మాత్రమే రాజీనామా చేస్తు న్నానని, పార్టీ సభ్యత్వానికి కాదని స్పష్టం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడు తున్న కాంగ్రెస్ పార్టీకి తనవల్ల చెడ్డపేరు రా కూడదనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పా రు. తన రాజీనామా అంశంపై వస్తున్న అ నుమానాలు, అపోహలపై రావత్ శనివారం ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేశారు.

రెండు రోజుల క్రితమే రావత్ పీఏ ఇంటిపై ఈడీ దాడులు చేసి రూ. 1.28 కోట్ల ఆస్తుల ను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఆయన నుంచి ఈ ప్రకటన వెలువడటం విశేషం. తన పీఏపై దాడుల గురించి చెబుతూ.. ద ర్యాప్తు పూర్తయిన తరువాత వాస్తవాలు తెలుస్తాయన్నారు. ఎన్నికలకు ముందు సీబీ ఐ తన ఇంటి తలుపు తడుతుందని తెలుస న్నారు.

ఉత్తరాఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు అవినీతికి వ్యతిరేకంగా బలంగా పోరాడుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. తనకు వ్యతిరేకంగా ఏదైనా సాక్ష్యం ఉంటే సీబీఐకి, పోలీసులకు అప్పగించాలని చెప్పారు. తన పదవీకా లంలో 42వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశానని హరీశ్ రావత్ వివరించారు. 

మరిన్ని వార్తలు