ఐరోపా దేశాల వల్లే ఉక్రెయిన్‌తో యుద్ధం

13-09-2026 | 05:25am
  1. మేం ఎవ్వరినీ బెదిరించలేదు..భవిష్యత్‌లోనూ బెదిరించబోం
  2. చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు
  3. భారత్‌తో బంధం మరింత బలోపేతం
  4. రష్యా అధ్యక్షుడు పుతిన్ వార్నింగ్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1౨: రష్యా ప్రయోజ నాలకు, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) హెచ్చరించారు. రష్యా ఐరోపాను ఎప్పుడూ బెదిరించలేదని, భవి ష్యత్‌లోనూ బెదిరించబోదన్నారు. నాటో విస్తరణ, ఐరోపా దేశాల జోక్యం వల్లే ఉక్రె యిన్‌తో యుద్ధం కొనసాగుతోందని ఆసక్తిక ర వ్యాఖ్యలు చేశారు. శనివారం బ్రిక్స్ సద స్సులో పాల్గొని మీడియాతో మాట్లాడారు.

రెండో ప్రపంచ యుద్ధం తరువాత అన్ని స మస్యలు పరిష్కారం అయ్యాయని చెప్పారు. తదనంతరం జరిగినదంతా రష్యన్ ఫెడరేషన్ సమ్మతితోనే జరిగిందని చెప్పారు. ఇప్పుడు ఐరోపా దేశాల నాయకులు ఉక్రెయిన్‌లోకి మరింత సైన్యాన్ని పంపేందుకు చర్చలు జరు పుతున్నారని, అంటే వారు తమతో యుద్ధాన్ని కోరుకుంటున్నారని స్పష్టమవు తుందన్నారు. వారివల్లే ఈ యుద్ధం కొన సాగుతుందని ఆరోపించారు.

ప్రస్తుత ప్రప ంచదేశాల్లో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల్లో దేశాల ఇంధన, ఆహార భద్రతకు సహకరించడానికి రష్యా సిద్ధంగా ఉందని చెప్పారు. పర్యాట కం, పరిశ్రమలు, వాణిజ్యం వంటి రంగాల కార్యకలా పాలకు రష్యా సంసిద్ధంగా ఉంద న్నారు.

బ్రిక్స్ దేశాలకు చైతన్యవంతమైన, శక్తివంతమైన మార్కెట్లు ఉన్నాయని, బ్రిక్స్ కూటమి దేశాలు ఎవరికీ వ్యతిరేకం కాదని అన్నారు. అదే సమయంలో మాస్కో ప్రపంచదేశాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకు నేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధ్యక్షు డు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు