అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు

12-09-2026 | 12:23pm

పాపన్నపేట,సెప్టెంబర్12: అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఏబీవీపీ(ABVP) నిరంతరం పోరాడుతూనే ఉంటుందని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మండల కన్వీనర్ సంతోష్ పేర్కొన్నారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఏబీవీపీ శనివారం చేపట్టిన అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపద్యంలో నాయకులను శనివారం తెల్లవారుజామున ముందస్తు అరెస్టు చేసి ఠాణాకు తరలించారన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళ్లాలనేటటువంటి లక్ష్యాన్ని ఏబీవీపీ ఎంచుకొని అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిందన్నారు.

మరిన్ని వార్తలు