కోదాడలో కొలువుల జాతర

12-09-2026 | 12:00pm

*జాబ్ మేళాకు 250 కంపెనీలు  హాజరు

కోదాడ సెప్టెంబర్ 12(విజయ క్రాంతి): నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 19న కోదాడ పట్టణంలోని సీసీ రెడ్డి స్కూల్‌(CC Reddy School)లో మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నాయకుడు రావెళ్ల కృష్ణారావు తెలిపారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సహకారంతో నిర్వహించే ఈ మేళాకు సుమారు 200–250 కంపెనీలు హాజరుకానున్నట్లు చెప్పారు. ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, డిగ్రీ, ఐటీఐతో పాటు అర్హత ఉన్న నిరుద్యోగ యువత నేరుగా ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు