ఢిల్లిలో భారీ వర్షం.. ఇందిరా గాంధీ ఎయిర్ పోర్ట్ లోకి వరద నీరు
న్యూఢిల్లీ: దేశ రాజధాని(national capital) ఢిల్లీని కుండపోత వర్షం కురిసింది. ఉరుములతో కూడిన వానతో పలు ప్రాంతాలు జలమయం కాగా, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(Indira Gandhi International Airport)లోకి వరదనీరు(Flood water) రావడంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాశ్రయానికి రావాల్సిన దాదాపు 9 విమానాలను ఇతర నగరాలకు మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో నాలుగు విమానాలను జైపూర్‌కు, మరో నాలుగు విమానాలను లక్నోకు, ఒకదానిని అహ్మదాబాద్‌కు దారిమళ్లించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఢిల్లీ(Delhi)లోని పలు ప్రాంతాల్లో 5 నుంచి 10 సెం.మీ. వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అంతేకాకుండా ఢిల్లీలో మరోసారి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.






