జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా గణపతి చౌహన్, నర్సింహులు ఎంపిక
నాగల్‌గిద్ద, సెప్టెంబర్ 4(విజయ క్రాంతి): నాగల్‌గిద్ద మండలా(Nagalgidda Mandal)నికి చెందిన ఇద్దరు ప్రధానోపాధ్యాయులు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ (Awards)కు ఎంపికయ్యారు. శేరిదామరగిద్ద గ్రామ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గణపతి చౌహన్, చోక్లా నాయక్‌తండా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. నర్సింహులు విద్యార్థుల అభ్యున్నతి, విద్యా ప్రమాణాల పెంపు, పాఠశాల అభివృద్ధికి చేసిన విశేష కృషికి గుర్తింపుగా అవార్డులకు ఎంపికయ్యారు.
వారి ఎంపికపై పీఆర్టీయూ(PRTU), యూటీఎఫ్(UTF) నాయకులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. యూటీఎఫ్(UTF) జిల్లా కార్యదర్శి సంతోష్, పీఆర్టీయూ మండల అధ్యక్షులు శేరికార్ రమేష్, ప్రధాన కార్యదర్శి జీవన్‌రావు, రవీందర్‌రావు, విజేందర్‌రెడ్డి, యూటీఎఫ్ నాగల్‌గిద్ద మండల అధ్యక్షులు విఠల్ నాయక్ తదితరులు గణపతి చౌహన్, బి. నర్సింహులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరి ఎంపిక మండల విద్యారంగానికి గర్వకారణమని పేర్కొన్నారు.






