4 September, 2026 | 8:38 PM

సుంకిడిలో ఘనంగా శ్రీకృష్ణ–రుక్మిణి కళ్యాణం

04-09-2026 | 07:26pm

తలమడుగు,(విజయక్రాంతి): తలమడుగు మండలం సుంకిడి గ్రామం(Sunkidi Village)లోని శ్రీకృష్ణ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు(Krishnashtami celebrations) ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ–రుక్మిణి కళ్యాణ మహోత్సవాన్ని(Sri Krishna-Rukmini wedding) అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితులు వీరయ్య, మల్లికార్జునుల మంత్రోచ్ఛారణల మధ్య కళ్యాణ వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ప్రత్యేక పూజలు, మంగళవాయిద్యాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. స్వామి కళ్యాణాన్ని వీక్షించేందుకు గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శ్రీకృష్ణ–రుక్మిణి దంపతులకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కళ్యాణ మహోత్సవం అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. అన్నదానంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు.