11 April, 2026 | 7:06 PM

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న రేవంత్ ప్రభుత్వం

09-10-2025 04:59 PM

బిజెపి రాష్ట్ర సీనియర్ నేత కొట్టే మురళి కృష్ణ..

కరీంనగర్ (విజయక్రాంతి): రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని బిజెపి రాష్ట్ర సీనియర్ నేత కొట్టే మురళీకృష్ణ మండిపడ్డారు. గురువారం కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని ఘాటుగా విమర్శించారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధితో కాంగ్రెస్ సర్కార్ పనిచేయడం లేదని, కేవలం కోర్టుల్లో హడావిడి చేస్తూ, అసలు అంశాన్ని పక్కదోవ  పట్టించే రాజకీయాలను కాంగ్రెస్ చేస్తుందని,  స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో గందరగోళ పరిస్థితులను సృష్టించిన కాంగ్రెస్ పార్టీ ముందు ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికలు జరగవని వారి పార్టీ క్యాడర్ కు కాంగ్రెస్ నాయకులే చెప్తున్నారని, కోర్టులో కేసులు వేయించింది కాంగ్రెస్ పార్టీ ఫీజులు చెల్లించింది కాంగ్రెస్ నాయకులేనని ఆయన ఆరోపించారు.