ఆత్మ ప్రాజెక్ట్ ద్వారా రైతులకు మరిన్ని సేవలందించండి
04-09-2026 | 12:04pm
బోథ్. సెప్టెంబర్ 4( విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఆత్మ ప్రాజెక్టు(ATMA Project) ద్వారా రైతులకు మరిన్ని సేవలు అందించాలని బోత్ బ్లాక్ ఆత్మ చైర్మన్(Both Block Atma Chairman) జి రాజు యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కేంద్రంలో జరిగిన రైతు సదస్సులు ఆయన మాట్లాడారు. ఎల్ ని నో ప్రభావం(El Nino effect) వల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతుందన్నారు. జిల్లాలో లోటు వర్షపాతం ఉందని భూగర్భ జలాల వినియోగం కోసం రైతాందానికి అవసరమైన విందు, తుంపర సేద్యం కోసం సామాగ్రిని సబ్సిడీ(Subsidy)పై అందించాలన్నారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకువచ్చే విధంగా అధికారులు కృషి చేయాలని కోరారు. అంతేగాక రైతాంగానికి పంటల సాగుపై అవగాహన కలిగించే విధంగా సదస్సులో నిర్వహించాలన్నారు






