రామాయంపేట మున్సిపాలిటీలో డ్రైడే - ఫ్రైడే కార్యక్రమం
04-09-2026 | 12:33pm
రామాయంపేట సెప్టెంబర్ 4 (విజయ క్రాంతి): రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో శుక్రవారం డ్రైడే - ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఏ. రవీందర్, కౌన్సిలర్ దేవుని రంజిత్. ఆధ్వర్యంలో శానిటరీ ఇన్స్పెక్టర్ వనిత మున్సిపల్ శానిటేషన్ సిబ్బందితో కలిసి మురికి కాలువల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. అనంతరం స్థానిక ప్రజలకు అంటు వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ నాగలక్ష్మి, మున్సిపల్ జవాన్ ప్రవీణ్, కృష్ణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.






