ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
04-09-2026 | 11:46am
మహబూబాబాద్, (విజయక్రాంతి): శ్రీ కృష్ణాష్టమి(Krishnashtami) జన్మాష్టమి వేడుకలు మహబూబాబాద్(Mahabubabad) జిల్లా వ్యాప్తంగా శుక్రవారం కోలాహలంగా ప్రారంభం అయ్యాయి. చిన్న పిల్లలను చిన్ని కృష్ణుడు, గోపికల వేషధారణలతో ముస్తాబు చేసి వేడుకలకు కొత్త శోభను తెచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు(Sri Krishna Janmashtami Celebrations) అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. పట్టణాలతో పాటు పల్లెల్లో యాదవ సంఘాల ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా శ్రీకృష్ణుడి శోభాయాత్ర నిర్వహించడంతోపాటు, ఉట్లు కొట్టే వేడుకలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.






