4 September, 2026 | 10:04 AM

గచ్చిబౌలిలో విల్లాలోకి చొరబడి మహిళపై హత్యాయత్నం

04-09-2026 | 04:55am

నిందితుడి కోసం గాలింపు

సెక్యూరిటీ ఏజెన్సీలతో సీఐ సైదులు సమావేశం

శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): విల్లాలోకి అక్రమంగా చొరబడి ఓ మహిళపై దాడి చేసి, హత్యాయత్నానికి ఒడిగట్టిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్(Gachibowli Police Station) పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. గచ్చిబౌలిలోని లుంబినీ స్ప్రింగ్స్ విల్లాస్లోని విల్లా నెం.12 లో నివాసముంటున్న ఎ. కల్యాణి రెడ్డి (46) అనే మహిళ, ఈ నెల 25వ తేదీన ఉదయం తన ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారితో కలిసి ఇంట్లో ఒంటరిగా ఉన్నారు.

ఆ సమయంలో నిందితుడు నాగరాజు అల్వాలా సైడ్ డోర్ పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు. ఆమెను రూ.10 లక్షలు ఇవ్వాలని బెదిరించగా, అందుకు నిరాకరించడం తో ఆమె కాళ్లను పట్టుకుని కిందపడేశాడు. ఈ ప్రమాదంలో ఆమె కుడి భుజం డిస్లోకేట్ అయింది. అనంతరం నిందితుడు తన వద్ద ఉన్న గుడ్డతో ఆమె మెడను బిగించి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. బాధితురాలు ధైర్యంతో నిందితుడిని కాలితో తన్ని, పై అంతస్తులోని గదిలోకి వెళ్లి తలుపులు వేసుకోవడంతో ప్రమాదం నుండి బయట పడ్డారు.

ఈ ఘటన తర్వాత నిందితుడు ఈ నెల 1వ తేదీ రాత్రి హ్యుందాయ్ ఎక్స్టర్ కారులో తిరిగి వచ్చి విల్లా వద్ద రెక్కీ నిర్వహించాడు. పరిసరాలను తన మొబైల్ ఫోన్లో వీడియో రికార్డు చేసి, బాధితురాలి భర్తకు బెదిరింపు సందేశాలు పంపడంతో పాటు అర్ధరాత్రి వేళ ఫోన్లు చేసి భయాందోళనకు గురిచేశాడు. ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన బాధితురాలు, భయంతో రెండు రోజులు ఆలస్యంగా బుధవారం రాత్రి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

భద్రతపై సీఐ సైదులు దిశానిర్దేశం..

ఈ ఘటన నేపథ్యంలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్‌ఓ సైదులు ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం స్థానిక సెక్యూరిటీ ఏజె న్సీల ఇన్చార్జులు, సూపర్వైజర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నివాస సముదాయాల్లో భద్రతా చర్యలను కట్టుదిట్టం చే యాలని, సెక్యూరిటీ సిబ్బంది నిరంతరం అ ప్రమత్తంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనా లు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని స్పష్టం చేశారు. సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.