4 September, 2026 | 12:09 PM

ఆధార్ తిప్పలు.. తప్పేది ఎప్పుడు?

04-09-2026 | 04:45am

వినియోగదారుల పడిగాపులు

ఖానాపూర్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) ఖానాపూర్ పరిసర మండలాల ప్రజలకు ఆధార్ తిప్పలు ఇంకా తీరలేదు. నెలల తరబడి తెల్లవారుజాము నాలుగు గంటలకే ఖానాపూర్ తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో ఉన్న ఆధార్ సేవా కేంద్రం వద్ద వినియోగదారులు పడిగాపులు కాయడం పరిపాటి అయిపోయింది.

ఈ నేపథ్యంలో అధికారులు ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని అదనపు సౌకర్యాలు కల్పించా ల్సి ఉండగా అలాంటి దిశగా ఎటువంటి చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదు. దాంతో మండల వాసులకు వ్యయ ప్రయాసలు తప్పడం లేదని వాపోతున్నారు .ప్రతిరోజు కేవలం 30 మందికి మాత్రమే ఆధార్ సవరణ చేసుకునే వెసలు బాటు ఉండడంతో నెంబర్ కోసం ఉదయం నాలుగు గంటలకే కేంద్రం వద్ద పడి గాపులు కాస్తున్నారు.

ఈ కేంద్రంలో ఆధార్ సేవల్లో భాగంగా ఫోన్ నెంబర్, అడ్రస్, ఫోటో, డేట్ అఫ్ బర్త్ ,కొత్త ఆధార్ కార్డ్, వంటి సేవలు అందిస్తున్నారు. ఇది వ్యక్తికి తప్పనిసరి కావడంతో ఆధార్ నమోదు చేసుకునేందుకు నానా తిప్పలు పడాల్సి వస్తుందని బీర్ నంది ,సొమారు పే ట్ గ్రామం వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి గత కొన్ని నెలలుగా ఉండటంతో ప్రజలు మరిన్ని కేంద్రా లు ఏర్పాటు చేసి తమ తిప్పలు తీర్చాలని ఆ వేదన వ్యక్తం చేస్తున్నారు.

దాంతో పాటు అప్పుడప్పుడు సర్వర్లు మొరాయించడంతో ప్రతిరోజు ఇచ్చిన నంబర్ల కంటే అదనపు సేవలు అందించాల్సి వస్తుందని అక్కడ సిబ్బంది చెప్తున్నారు. కాగా మండలానికి మరో రెండు ఆధార్ కేంద్రాలు మంజూరు ఉన్నాయని తెలిసింది. ఆ కేంద్రాలు ఇంకా కార్యరూపం దాల్చకపోవడంతో వినియోగదారులకు తిప్పలు తప్పడం లేదు. ఇకనైనా అధికారులు స్పందించి ప్రజా సౌకర్యార్థం మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేసి సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అంటున్నారు.