4 September, 2026 | 1:01 PM

ఒక్క పోటుతో అంతా కూల్చేశారు

04-09-2026 | 04:30am
  1. తనపై వేటు వేయడంపై చిన్నారెడ్డి రియాక్షన్ 
  2. పదవులపై ఆశలేదు.. పదవి పోయినందుకు బాధపడటం లేదు  
  3. ప్రస్తుత సమస్యకు మల్లు రవే కారణం
  4. పదవి లేకపోయినా ప్రజల మధ్యనే ఉంటా 
  5. మాజీ మంత్రి చిన్నారెడ్డి 

వనపర్తి/హైదరాబాద్, సెప్టెంబర్  3 (విజయక్రాంతి) : ఎంతో కష్టపడి రాజకీయంగా ఈ స్థాయికి వచ్చిన తనను ఒక్క పోటుతో అంతా కూల్చేశారని మాజీ మంత్రి, తెలంగాణ ప్లానింగ్ కమిషన్ మాజీ వైస్ చైర్మన్ జిల్లెల చిన్నారెడ్డి(Jillela Chinna Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. పదవిపై తనకు ఎప్పుడూ ఆశ లేదని, పదవి పోయిందని బాధపడాల్సిన అవసరం కూడా లేదని అన్నా రు. అధిష్ఠానం కొండా సురేఖ(Konda Surekha)తో పాటు చిన్నారెడ్డిపై కూడా చర్యలు తీసుకు న్న నేపథ్యంలో గురువా రం ఆయన మీడియాతో మాట్లాడారు.

పదవులు వస్తుంటాయి, పోతుంటాయని.. ప్రజలు, కార్యకర్తలతో తనకున్న అనుబంధం మాత్రం శాశ్వతమని పేర్కొన్నారు. తనను పదవి నుంచి తొలగించిన విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)ని కలవలేదని, కలవాలన్న ప్రయత్నం కూడా చేయలేదని స్పష్టం చేశారు. వనపర్తి జిల్లా(Wanaparthy District) కోసం దీక్ష కూడా చేశానని గుర్తు చేశారు.  తనకు ఇచ్చిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి(Vice-Chairman post of the Planning Board)కి సంబంధించిన ఉత్తర్వుల్లో ‘ఇంటిగ్రేటెడ్ ఆర్డర్(Integrated Order)’గా పేర్కొన్నారని, ఎన్నేళ్లు పదవిలో కొనసాగాలనే విషయాన్ని  ప్రస్తావించలేదన్నారు.

రాజకీయ భవిష్యత్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసు కోలేదని స్పష్టం చేశారు. ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి తాను కాంగ్రెస్‌లో ఉన్నానని, తెలంగాణ మలిదశ ఉద్యమంలోనూ చురు గ్గా పాల్గొన్నానని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీలో వి.హనుమంతరావు తర్వాత తానే సీనియర్ నేతనన్నారు. ప్రస్తుత సమస్యకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవే ప్రధాన కారణమని ఆరోపించారు. ‘నా మనుషులు వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాయానికి వెళ్లే మెడ పట్టి నెట్టేస్తానని మేఘారెడ్డి హెచ్చరించారు. అయినా భరించాను’ అని చిన్నారెడ్డి వెల్లడించారు. నమ్ముకున్న కార్యకర్తలను వదులుకోనని స్పష్టం చేశారు.