ఏడేళ్ల తర్వాత..! భారత్‌లో అడుగుపెట్టిన చైనా అధ్యక్షుడు
బీజింగ్: 18వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్(Chinese President Jinping) శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సమావేశం సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో(Prime Minister Narendra Modi) చర్చలు జరపనున్నారు. మోదీ ఆహ్వానం మేరకు న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు జిన్‌పింగ్ శనివారం ఉదయం బీజింగ్ నుంచి బయలుదేరారని ప్రభుత్వ వార్తా సంస్థ షిన్హువా తెలిపింది.
అతని పరివారంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ (Communist Party of China) పొలిటికల్ బ్యూరో ఉన్నత స్థాయి స్టాండింగ్ కమిటీ సభ్యుడు సీపీసీ సెంట్రల్ కమిటీ జనరల్ ఆఫీస్ డైరెక్టర్ అయిన సన్నిహితుడు కై క్వి, విదేశాంగ మంత్రి, సిపిసి సెంట్రల్ కమిటీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు అయిన వాంగ్ యి ఉన్నారని ఆ వార్తా నివేదిక తెలిపింది. దాదాపు ఏడేళ్లలో అధ్యక్షుడు షీ భారతదేశాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి. ప్రధాని మోదీ-షీ భేటీని చైనా ఎలా చూస్తోందన్న ప్రశ్నకు విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ జరిగిన మీడియా సమావేశంలో స్పందిస్తూ, కజాన్, టియాంజిన్‌లలో జరిగిన సమావేశాల తర్వాత ఈ ఇద్దరు నాయకులు వరుసగా మూడవ ఏడాది కలుసుకోవడం ఇదేనని పేర్కొన్నారు.