స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

29-09-2026 | 03:35pm

మఠంపల్లి సెప్టెంబర్ 29(విజయ క్రాంతి): మండల పరిధి లోని కాల్వపల్లి తండా గ్రామంలో మంగళవారం స్మార్ట్ రేషన్ కార్డులు(Smart Ration Cards) పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ(Congress Party) సీనియర్ నాయకులు సర్పంచ్ మాలోతు సక్రు నాయక్,డీలర్ లక్ష్మి,జిపిఓ శ్రీనివాస్ లతో కలిసి లబ్దిదారు లకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.

అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం అందించే రేషన్ సరుకులు, ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు మరింత సులభంగా అందే అవకాశం ఉంటుందని, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని పేర్కొ న్నారు.

కార్డులు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి,సర్పంచ్ కు  కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి సీతారాములు,ఉపసర్పంచ్ బాబా,వార్డు సభ్యులు రమేష్ సావిత్రి లచ్చిరాం,నాగరాజు, బాబు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు