ఓట్ల తొలగింపుపై ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం సరికాదు

08-10-2026 | 08:48pm

కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు

మునుగోడు, అక్టోబర్ 8 (విజయక్రాంతి): ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్న ప్రాథమిక హక్కైన ఓటును పరిరక్షించాలని ప్రశ్నిస్తూ ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ(Senior Congress leader Rahul Gandhi), ప్రియాంక గాంధీలను అరెస్టు చేయడం సరికాదని కాంగ్రెస్ పార్టీ(Congress Party) మునుగోడు మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు అన్నారు.

కాంగ్రెస్ అగ్రనేతల అరెస్టులను నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆదేశాల మేరకు గురువారం మునుగోడు మండల కేంద్రంలోని చౌరస్తాలో మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించడం ప్రజాస్వామ్య హక్కులపై దాడి చేయడమేనని ఆరోపించారు.

ఓటు హక్కును కాపాడాల్సిన ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించకుండా అధికార పక్షం కనుసన్నల్లో పనిచేస్తోందని విమర్శించారు. ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడిన అధికారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు జాబితాలో ఉండేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు కోరారు.

ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ జాజుల అంజయ్యగౌడ్, కాంగ్రెస్ జిల్లా నాయకులు బూడిద లింగయ్యయాదవ్, చండూరు వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ కుంభం చెన్నారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాల్వాయి చెన్నారెడ్డి, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ అన్వర్, కాంగ్రెస్ మండల నాయకులు జక్కల శ్రీనివాస్, పంతంగి స్వామి, మందుల బీరప్ప, ఆరేళ్ల సైదులు,

పాలకూరి మహేష్, ఆవుల శ్రీను, వివిధ గ్రామాల సర్పంచులు కంభంపాటి జ్యోతి వెంకటేశ్వర్లు, దాసరి గోవర్ధన్, కదిరే లింగయ్య, వరికుప్పల భువనేశ్వరి విజయ్, కొంపెల్లి ఉపసర్పంచ్ వెదిరే విజయేందర్‌రెడ్డి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బెల్లి పూర్ణయాదవ్‌తో పాటు నన్నూరి సత్తిరెడ్డి, నక్క వెంకన్న, కట్ట రాజు, బోయ సతీష్, దర్శనం పవన్ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు