అనారోగ్యంతో మృతి చెందిన యువకుని కుటుంబానికి ఆర్థిక సాయం

08-10-2026 | 09:47pm

మునుగోడు, అక్టోబర్ 8 (విజయక్రాంతి): మునుగోడు మండలంలోని జమస్తాన్ పల్లి గ్రామానికి చెందిన జినుకల సైదులు పెద్ద కుమారుడు జినుకల రామకృష్ణ (28) అనే యువకుడు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స(Hospital treatment) పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న *కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు,డిసిసిబి ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి గారు తక్షణ సాయం కింద 10,000రూపాయలును గ్రామ సర్పంచ్ అందుగుల నర్సమ్మ యాదయ్య,

మాజీ సర్పంచులు పంతంగి స్వామి, ముంత యాదగిరి, సీనియర్ జర్నలిస్ట్ జాజుల స్వామి గౌడ్  మృతుడుని కుటుంబ సభ్యులకు అందించి, మృతదేహానికి  పూలమాలవేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం అందించి భరోసా కల్పించిన కుంభం శ్రీనివాస్ రెడ్డి కి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు జాజుల శంకర్, ముంత హేమంత్, పంతంగి వెంకన్న, జాజుల రవి, పంతంగి ప్రసాద్, కొప్పుల అశోక్, అందుగుల నరేందర్, ముంత రవీందర్, అందుగుల మారేష్, జినుకల స్వామి, పగిళ్ల సైదులు, పగిళ్ల లింగస్వామి, పంతంగి ప్రతాప్, చెక్క లింగరాజు  ఉన్నారు.

మరిన్ని వార్తలు