అతిథి ఉపాధ్యాయుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలి
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో(Kasturba Gandhi Balika Vidyalayam) ఖాళీగా ఉన్న అతిథి ఉపాధ్యాయుల పోస్టుల భర్తీని పారదర్శకంగా, మెరిట్ ఆధారంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్(Additional Collector Yuvaraj Marmat) అన్నారు. గురువారం జిల్లాలో జరుగుతున్న ఎంపిక ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యర్థుల బోధనా నైపుణ్యం, విషయ పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఎంపికలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా నిబంధనల ప్రకారం నిర్వహించాలని, దళారులు, మధ్యవర్తులను నమ్మి అభ్యర్థులు మోసపోవద్దని హెచ్చరించారు. అర్హత, ప్రతిభ ఉన్న అభ్యర్థులకు మాత్రమే అవకాశం కల్పిస్తామని తెలిపారు.