యువత స్వయం ఉపాధితో ఆర్థికంగా రాణించాలి
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్
తుంగతుర్తి( విజయ క్రాంతి): నిరుద్యోగ యువత స్వయం ఉపాధితో ఆర్థికంగా రాణించాలని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్(Former MLA Dr. Gadari Kishore Kumar) అన్నారు. గురువారం తుంగతుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు తడకమళ్ళ రవికుమార్ ఇటీవల ఏర్పాటు చేసిన రాయల్ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను ఆయన సందర్శించి మాట్లాడారు.
యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడుతూనే ప్రత్యామ్నాయంగా వివిధ వ్యాపారాల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య, జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, కేతిరెడ్డి గోపాల్ రెడ్డి, తునికి సాయిల్ గౌడ్ గుండగాని దుర్గయ్య, కొండగడుపుల నాగయ్య, కరుణాకర్, గొపగాని రమేష్ గునిగంటి సంతోష్, ఉప్పుల నాగమల్లు, బొజ్జ సాయి కిరణ్ మల్లికార్జున్, మల్లేష్, మధు, సాయి, గోపి, రాజు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.