ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ నిరసన

08-10-2026 | 10:21pm

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం(BJP government) ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలను కాపాడటంలో విఫలమవుతోందని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క(DCC President Athram Sugunakka) ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు రక్షణ కోసం గురువారం జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ అంబేద్కర్ విగ్రహం ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ.... ఓటు చోరీకి తావులేకుండా ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎవరి ఓటు హక్కు అన్యాయంగా తొలగిపోకుండా చూడాలన్నారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల మంగ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అబ్దుల్లా, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ తారీక్, మండల, పట్టణ అధ్యక్షులు మురళి, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు