భూ రీ సర్వే పారదర్శకంగా జరగాలి

30-10-2026 | 03:44pm

పోచాపూర్ శివారులోని సర్వే పనులను పరిశీలించిన కలెక్టర్. 

నాగర్‌కర్నూల్ (విజయక్రాంతి): భూ రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్(Collector Hemant Keshav Patil) అధికారులను ఆదేశించారు. శుక్రవారం పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామ పరిధిలోని పోచాపూర్ శివారులో జరుగుతున్న రీ సర్వే పనులను పరిశీలించారు.

గ్రామ పరిధిలో మొత్తం 544 ఎకరాలకు గాను ఇప్పటివరకు 120 ఎకరాల్లో సర్వే పూర్తయినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. మిగిలిన భూముల సర్వేను వేగవంతం చేయాలని, భూముల హద్దులు, విస్తీర్ణం, యాజమాన్య వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. వారసత్వ భూ బదిలీల్లో భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించి, నిర్ణీత గడువులో సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఏడీ సర్వేయర్ గిరిధర్, ఆర్డీవో బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు