బియ్యం ధరలు పెంచితే ఖబడ్దార్!
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): జిల్లాలో బియ్యం విక్రయాలు ప్రభుత్వ నిర్దేశించిన గరిష్ఠ ధరలకే జరగాలని అదనపు కలెక్టర్ బి. చేన్నయ్య వ్యాపారులను ఆదేశించారు. నిర్ణీత ధరల కంటే అధికంగా విక్రయిస్తే సంబంధిత వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు (Rice Price Control).
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్, రైస్ మిల్లర్ల సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఖరారు చేసిన ధరల వివరాలను ఆయన వెల్లడించారు. కిలో తెలంగాణ బీపీటీ బియ్యం రూ.66, సోనా బియ్యం రూ.74, శ్రీరామ్ గోల్డ్ బియ్యం రూ.79కు మించి విక్రయించరాదని స్పష్టం చేశారు (Government Fixed Prices).
రైస్ మిల్లర్లు, హోల్సేల్, రిటైల్ వ్యాపారులు నిర్ణయించిన ధరలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వినియోగదారుల నుంచి అధిక ధరలు వసూలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు (Retail Market).
జిల్లాలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తారని, ఈ సందర్భంగా అధిక ధరలకు బియ్యం విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ హెచ్చరించారు (Strict Action).