ఓట్ బచావో – దేశ్ బచావో

01-11-2026 | 05:46pm

జగిత్యాల, నవంబర్ 01 (విజయక్రాంతి): ఓట్ బచావో – దేశ్ బచావో కార్యక్రమం(Vote Bachao Desh Bachao program)లో పాల్గొనేందుకు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య లు జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి ఢిల్లీకి  చేరుకున్నారు.

ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ దేశ ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు పవిత్రతను కాపాడటం, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను సాధించడం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ కార్యక్రమంలో జగిత్యాల నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారని అన్నారు.

ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగ హక్కు అని, ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమమని చాటిచెప్పేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఓటు చోరీ, ఓటర్ల జాబితాలో అక్రమాలు, ఎన్నికల వ్యవస్థలో జరుగుతున్న అవకతవకలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ డిల్లీ లో చేస్తున్న పోరాటానికి మద్దతుగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజంగి నందయ్య, జగిత్యాల నియోజకవర్గ  నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు