సర్పంచ్‌కు మళ్లీ బాధ్యతలు
తుమ్మలగుడ సర్పంచ్ గా కొండ రాంప్రసాద్ పునరుద్ధరణ - కలెక్టర్ ఉత్తర్వులు
బెజ్జూర్, నవంబర్ 01 (విజయక్రాంతి): కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం తుమ్మలగుడ గ్రామ పంచాయతీ(Tummulaguda Gram Panchayat) సర్పంచ్ గా కొండ రాంప్రసాద్ ను తిరిగి పునరుద్ధరిస్తూ జిల్లా కలెక్టర్ (పంచాయత్ వింగ్) కే.హరిత, ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ పంచాయతీ పరిధిలో 15 రోజులకు పైగా గైర్హాజరయ్యారని ఎంపీవో , బెజ్జూర్ నివేదిక ఇవ్వడంతో, సెక్షన్ 38(2) తెలంగాణ పంచాయత్ రాజ్ చట్టం 2018 ప్రకారం సర్పంచ్ అధికారాలను ఉప సర్పంచ్ శంకర్ కు అప్పగిస్తూ గతంలో ఉత్తర్వులు జారీ అయ్యాయి.
దీనిపై కొండ రాంప్రసాద్ షోకాజ్ నోటీసుకు లిఖితపూర్వక వివరణ ఇచ్చారు. 07.10.2026 నుండి గ్రామ పంచాయతీలో అందుబాటులో ఉండి విధులు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నానని, తన అధికారాలను పునరుద్ధరించాలని కోరారు.దీనిని పరిశీలించిన కలెక్టర్, ఉప సర్పంచ్ కు అప్పగించిన బాధ్యతల ఉత్తర్వులను (Ref 5th) రద్దు చేస్తూ, కొండ రాంప్రసాద్ ను తక్షణమే సర్పంచ్ గా పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ హరిత తుమ్మలగూడ సర్పంచ్ కొండ రాంప్రసాద్ కు తిరిగి సర్పంచ్ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఎంపీడీవో బండారి ప్రవీణ్ కుమార్,ఎంపీ ఓ శ్రీనివాస్ తెలిపారు.