ఘనంగా డీవైఎఫ్ఐ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కొత్తపల్లి, నవంబర్ 01 (విజయక్రాంతి): కరీంనగర్(Karimnagar) పట్టణం రాంనగర్లో గల భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య కార్యాలయంలో 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేష్ పటేల్ పాల్గొని సంఘం పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ సమైక్యత, సమగ్రత, లౌకికత్వం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం డివైఎఫ్ఐ ఆవిర్భావం నుంచి నిరంతరం పోరాటాలు నిర్వహిస్తోందని తెలిపారు.రాబోయే రోజుల్లో నిరుద్యోగం, విద్యా సమస్యలు, సామాజిక అసమానతలు, మాదకద్రవ్యాల వ్యసనం, మహిళలపై హింస వంటి సమస్యలపై మరింత విస్తృతంగా ఉద్యమాలు చేపడతామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రాజ్ కుమార్.కృష్టా.నాయకులు ప్రకాష్.వెంకటేష్.సిరి ప్రసాద్.సతీష్.ఉదయ్ సింగ్.శ్రీహరి.శ్రీకాంత్.శ్రీనివాస్.దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.