కిలో చికెన్ ఫ్రీ.. కొత్త ఆఫర్

01-11-2026 | 11:03am

ఓటర్ స్లిప్ చూపిస్తే కిలో చికెన్ ఫ్రీ.. నెల్లూరులో అభ్యర్థి కొత్త ఆఫర్!

నెల్లూరు: ఎన్నికల వేళ(AP municipal election) ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు రకరకాల మార్గాలను అనుసరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు నగదు, చీరలు పంపిణీ చేస్తుంటే.. మరికొందరు నిత్యావసర సరుకులను అందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా నెల్లూరులో ఓ కాంగ్రెస్ అభ్యర్థి(Nellore Congress Candidate) ఓటర్లకు కిలో చికెన్ ఉచితంగా ఇస్తానంటూ ప్రకటించిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ Free Chicken Offer‌తో స్థానికంగా ఒక్కసారిగా సందడి నెలకొంది.

వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరులోని ఓ డివిజన్‌లో గట్టి పోటీ నెలకొన్న నేపథ్యంలో సదరు అభ్యర్థి ఓటర్ స్లిప్పులను పంపిణీ చేసినట్లు సమాచారం. ఆ స్లిప్‌ను చూపిస్తే కిలో చికెన్ ఉచితంగా ఇస్తామని ప్రకటించినట్లు తెలుస్తోంది. శని, ఆదివారాలు రెండు రోజుల పాటు ఈ Offer అమల్లో ఉంటుందని చెప్పడంతో చికెన్ తీసుకునేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వెంకటేశ్వరపురంలోని జనార్ధన్ రెడ్డి కాలనీలో ఉన్న చికెన్ షాప్ వద్ద ఒక్కసారిగా జనం గుమిగూడారు.

ఉచితంగా చికెన్(Free chicken) తీసుకునేందుకు వచ్చిన వారితో Shop కిక్కిరిసిపోయింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం చికెన్ షాప్‌ను మూసివేయించారు. ఎన్నికల సమయంలో ఓటర్లకు ప్రలోభాలు కల్పిస్తున్నారనే అంశంపై ఈ ఘటన స్థానికంగా చర్చకు దారితీసింది. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేలా నగదు, వస్తువులు లేదా ఇతర ప్రయోజనాలు అందించడం ఎన్నికల నియమావళి పరిధిలోకి వచ్చే అంశం. ఈ ఘటనపై సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు