తుడుకూర్తిలో ఉచిత దంత వైద్య శిబిరం

01-11-2026 | 05:44pm

నాగర్‌కర్నూల్: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో తుడుకూర్తి గ్రామంలోని కూచుకుళ్ళ కొండమ్మ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం కూచుకుళ్ళ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం (Dental Camp) నిర్వహించారు.

ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి సతీమణి సరిత రెడ్డి ఆధ్వర్యంలోని వైద్య బృందం (Medical Team) గ్రామస్థులకు ఉచితంగా దంత పరీక్షలు (Dental Checkups) నిర్వహించింది. అవసరమైన వైద్య సేవలు అందించడంతోపాటు దంతాల సంరక్షణకు సంబంధించి పలు ఆరోగ్య సూచనలు (Health Tips) ఇచ్చింది.

గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న కూచుకుళ్ళ ఫౌండేషన్ సేవలను ఈ సందర్భంగా గ్రామస్థులు అభినందించారు.

మరిన్ని వార్తలు