చోరీ బాధిత కుటుంబానికి జీవన్ రెడ్డి ఆర్థిక చేయూత

01-11-2026 | 05:51pm

జగిత్యాల, నవంబర్ 01(విజయక్రాంతి): జగిత్యాల పట్టణంలోని నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో తెలంగాణ భవన్‌లో పనిచేస్తున్న గంగాధర్ ఇంట్లో ఇటీవల చోరీ జరిగింది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి(Jeevan Reddy) బాధిత కుటుంబాన్ని ఆదివారం పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, కష్టకాలంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. జీవన్ రెడ్డి వెంట జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్ దేవేందర్ నాయక్, శ్రీరాముల గంగాధర్ తదితరులున్నారు.

మరిన్ని వార్తలు