శ్రీ కృష్ణ మందిరానికి భూదానం..
01-11-2026 | 05:40pm
తాడ్వాయి, నవంబర్ 01 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో సోమవారం శ్రీకృష్ణ మందిరానికి దాతలు భూదానం చేశారు. గ్రామానికి చెందిన ప్రముఖ వైద్యులు పాత రామలింగం, పాత జయప్రకాష్ లు రూ.9 లక్షల విలువైన భూమిని మందిరానికి విరాళంగా అందించారు. పూర్వీకుల జ్ఞాపకార్థం, మాతృభూమి రుణం తీర్చుకోవడం కోసం భూదానం చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పీఆర్టీయూ అధ్యక్షులు అంబీర్ మనోహర్ రావు, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు జక్కుల రాజిరెడ్డి, ప్రతినిధులు కృష్ణమూర్తి, రాజేశ్వర్ రావు, పాత భాస్కర్, సిద్ధి రాములు తదితరులు పాల్గొన్నారు.