పట్టభద్రుల ఓటరు నమోదు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలి
- మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి
అచ్చంపేట: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్(BRS) నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే, అచ్చంపేట పార్టీ సమన్వయకర్త మర్రి జనార్దన్‌రెడ్డి(Former MLA Marri Janardhan Reddy) పిలుపునిచ్చారు. సోమవారం అచ్చంపేటలోని పటేల్ ఫంక్షన్ హాలులో హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల(Graduate MLC elections) సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలని, గ్రామాలు, పట్టణాలు, వార్డుల వారీగా అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఎన్నికల ఇన్‌ఛార్జి శుభప్రద్ పటేల్, సీనియర్ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, పీఏసీఎస్ చైర్మన్లు, వివిధ మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.