ఎమ్మెల్సీ గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్‌ అడుగులు

30-10-2026 | 07:37pm

మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి

వెంకటాపూర్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) కనీసం కరెంట్, నీళ్లు కూడా సక్రమంగా అందించలేకపోతోందని, అలాంటి పార్టీకి పట్టభద్రులు ఎందుకు ఓటు వేయాలని మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికల ములుగు నియోజకవర్గ ఇంచార్జి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి(Constituency In-charge Muthireddy Yadagiri Reddy) అన్నారు.

ఈ సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లింగాల రమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ములుగు నియోజకవర్గ ఇంచార్జి బడే నాగజ్యోతితో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో 24 గంటల ఉచిత విద్యుత్, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించామని, రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్‌ రెడ్డిని గెలిపించేందుకు ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, జిల్లా నాయకులు మల్క రమేష్, కాకులమర్రి ప్రదీప్ రావు, జగదీష్, గై అశోక్, మాజీ సర్పంచులు రహీం, జగన్మోహన్ రావు, మాజీ ఎంపీటీసీ రవి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు