ఉమ్మడి వరంగల్ జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్

03-11-2026 | 03:47pm

వెంకటాపూర్, నవంబర్ 03 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్(District Photo and Videographers Welfare Association) ఉపాధ్యక్షుడిగా మండల కేంద్రానికి చెందిన శ్రీరామ స్టూడియో నిర్వాహకుడు దేశిని మహేందర్ గౌడ్ నూతనంగా నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ములుగు జిల్లా కేంద్రంలో ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.

ఇటీవల నిర్వహించిన అసోసియేషన్ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్, జిల్లా అధ్యక్షుడు గాదె లింగమూర్తి తదితర జిల్లా బాధ్యుల సమక్షంలో మహేందర్ గౌడ్‌కు నియామక పత్రాన్ని అధికారికంగా అందజేశారు. ఈ సందర్భంగా నూతన ఉపాధ్యక్షుడు మహేందర్ గౌడ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన జిల్లా అధ్యక్షుడు గాదె లింగమూర్తి,

వర్కింగ్ ప్రెసిడెంట్ సునీల్ కుమార్, జిల్లా ఆర్గనైజర్ పిల్లలమర్రి రాము, ములుగు జిల్లా మాజీ అధ్యక్షుడు కందుల రవి, సీనియర్ ఫోటోగ్రాఫర్లు మహావీర్, శ్రీనివాస్ గౌడ్, సంతోష్, సదానందం, వెంకట్, రావిరాజు, దేవేందర్, యుగేందర్‌తో పాటు అసోసియేషన్ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఫోటోగ్రాఫర్ల హక్కుల సాధనకు, వారి సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు