అభివృద్ధి పేరుతో చిరు వ్యాపారుల జీవితాలు ఆగం
ప్రత్యామ్నాయ షెల్టర్లు వెంటనే ఏర్పాటు చేయాలి: సిపిఐ
భూపాలపల్లి టౌన్, నవంబర్ 03 (విజయ క్రాంతి): పట్టణ అభివృద్ధిలో(Urban Development) భాగంగా రోడ్డు వెడల్పు పనుల కోసం దుకాణాలను తొలగించుకొని ప్రభుత్వానికి సహకరించిన చిరు వ్యాపారులు ప్రస్తుతం ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్(CPI Town Secretary Sotuku Praveen Kumar) అన్నారు.
ఈ మేరకు సిపిఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. గత నెల రోజులుగా వ్యాపారాలు లేక 200కు పైగా కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, బ్యాంకు ఈఎంఐలు, అప్పులు చెల్లించలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ వ్యాపార స్థలాలు, పక్కా షెల్టర్లు ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు నూకల చంద్రమౌళి, కౌన్సిలర్ వేముల జ్యోతి శ్రీకాంత్, గోలి లావణ్య, గుర్రం సంపత్, పెద్దమాముల సంధ్య, సుభద్ర, చిరు వ్యాపారులు రంజిత్, జంపాల తిరుపతి, సతీష్, బోడ బిల్ సింగ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.