చేగుంట ని కరువు మండలం గా ప్రకటించాలి అని కోరుతూ
మండల సర్వ సభ్య సమావేశాన్ని బహిష్కరించిన సర్పంచ్ లు
చేగుంట నవంబర్ 03,విజయక్రాంతి: చేగుంట మండలన్నీ కరువు మండలం గా(Drought-affected mandal) ప్రకటించాలని కోరుతూ మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో(MPDO Office) ఎంపీడీఓ చిన్న రెడ్డి అధ్యక్షతన, మండల ప్రత్యేక అధికారి హేమ భార్గవి ఆధ్వర్యంలో ఏర్పాటు మండల సాధారణ సభ్య సమావేశంలో, మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు సండ్రుగు స్రవంతి సతీష్, వివిధ గ్రామాల సర్పంచ్ లు ఆధ్వర్యంలో సమావేశాన్ని బహిష్కరించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎల్నినో ఎఫెక్ట్ తో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని మనోహర్ బాద్ (1 )మండలన్నీ మధ్యస్థ కరువు మండలం గా ప్రకటించినప్పటికీ, జిల్లా లో ఉన్న మిగతా మండలతో పాటు చేగుంట మండలన్నీ కరువు మండలం ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం మండల ప్రత్యేక అధికారి హేమ భార్గవికి తీర్మానం చేసి,ప్రతిని ఆమెకు అందజేశారు, ఈ కార్యక్రమం లో మండల వివిధ శాఖల అధికారులు, ఎంపీవో, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.