పెనుకొండలో ఎన్డీయే క్లీన్ స్వీప్

03-11-2026 | 12:32pm

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మున్సిపల్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 23 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అన్ని స్థానాలను కైవసం చేసుకున్నారు. దీంతో మున్సిపాలిటీపై ఎన్డీయే కూటమి పూర్తి ఆధిపత్యం సాధించింది.ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (TDP) అభ్యర్థులు 21 వార్డుల్లో విజయం సాధించారు. మరోవైపు బీజేపీ (BJP), జనసేన (Jana Sena) అభ్యర్థులు ఒక్కో వార్డును దక్కించుకున్నారు. దీంతో మొత్తం 23 స్థానాలూ ఎన్డీయే కూటమి ఖాతాలో చేరాయి.

ఇవి కూడా చదవండి: ఎమ్మెల్యేల గైర్హాజరుపై ఎంపీ చురకలు!

ఎన్నికల ఫలితాలతో కూటమి నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. భారీ విజయంతో పార్టీ శ్రేణులు సంబరాలకు సిద్ధమయ్యాయి. పెనుకొండ మున్సిపాలిటీలో కొత్త పాలకవర్గం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ ఫలితాలు స్థానిక రాజకీయాల్లో (Local Politics) కీలక పరిణామంగా నిలిచాయి.

మరిన్ని వార్తలు