కరువు ప్రభావిత రైతులకు రుణ సాయమందించాలి

03-11-2026 | 04:21pm

బ్యాంకర్లను సూచించిన జిల్లా కలెక్టర్.

నాగర్ కర్నూల్ ( విజయక్రాంతి ): కరువు ప్రభావిత రైతులకు ఆర్థిక ఉపశమనం కల్పించేందుకు రూ.1,778.51 కోట్ల వ్యవసాయ రుణాల పునర్వ్యవస్థీకరణకు(Restructuring of agricultural loans) చర్యలు చేపట్టాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్(Collector Hemant Keshav Patil) బ్యాంకు అధికారులను ఆదేశించారు.

మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక డీసీసీ సమావేశంలో మాట్లాడుతూ అర్హులైన రైతులకు 12 నెలల మారటోరియం కల్పించి, రుణ చెల్లింపు గడువును మండలాల కరువు తీవ్రతను బట్టి 36 నుంచి 60 నెలల వరకు పొడిగించాలన్నారు.

కొత్త పంట రుణాలను సకాలంలో మంజూరు చేయాలని, రైతులపై రుణ వసూళ్ల ఒత్తిడి చేయరాదని స్పష్టం చేశారు. వారం రోజుల్లో అర్హులైన రైతులను గ్రామాల వారీగా గుర్తించి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. వారి వెంట అదనపు కలెక్టర్ చెన్నయ్య, లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్, బ్యాంక్ అధికారులు ఉన్నారు.

మరిన్ని వార్తలు