ఎస్‌ఐఆర్ ప్రక్రియను రద్దు చేయాలి

03-11-2026 | 04:32pm

ఆసిఫాబాద్, నవంబర్ 3 (విజయ క్రాంతి): ఓటు హక్కును పరిరక్షించేందుకు ఎస్‌ఐఆర్ ప్రక్రియను రద్దు చేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్(Election Commissioner Gyanesh Kumar) రాజీనామా చేయాలని డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రాజ్‌కుమార్ దుర్గం డిమాండ్ చేశారు.మంగళవారం జిల్లా కేంద్రంలో డీవైఎఫ్‌ఐ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గెడం టికానంద్ జెండా ఆవిష్కరించారు.అనంతరం రాజ్‌కుమార్ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ ప్రక్రియతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని ఆరోపించారు.సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసి ఈ ప్రక్రియపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.జిల్లా అధ్యక్షుడు టికానంద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని, రాజీవ్ యువ వికాసం పథకాన్ని అర్హులైన లబ్ధిదారులకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి దుర్గం నిఖిల్, నాయకులు చక్రి, పవన్, శ్రీను, రవికుమార్, లలిత, ప్రమీల, సంధ్య, సంగీత తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు