నల్లగొండ నుంచి మునుగోడుకు తీన్మార్ మల్లన్న పాదయాత్ర
03-11-2026 | 04:37pm
నల్లగొండ, నవంబర్ 3 (విజయ క్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ(telangana rajyadhikara party) అధినేత తీన్మార్ మల్లన్న పాదయాత్ర(Teenmar Mallanna’s padayatra) మంగళవారం నల్లగొండ నియోజకవర్గం నుంచి మునుగోడు నియోజకవర్గానికి బయలుదేరింది. బీసీలకు రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్ర పాదయాత్రలో భాగంగా మునుగోడు నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. పలు గ్రామాల్లోని ప్రజలు యాత్రలో పాల్గొని బ్రహ్మరథం పడుతున్నారు.