మెగాస్టార్ టైటిల్‌తో యంగ్ హీరో

27-11-2026 | 06:42pm

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) గతంలో నటించిన సూపర్ హిట్ టైటిల్ ఇప్పుడు యంగ్ హీరో విరాట్ కర్ణ(Young hero Virat Karna)కు దక్కింది. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రానికి ‘రుస్తుం’ అనే పేరును ఖరారు చేశారు. విరాట్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేసింది.

ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్(PrimeShow Entertainment) బ్యానర్‌పై భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో కనిష్క గంధం దర్శకుడిగా(Kanishka Gandham Director) పరిచయమవుతున్నారు. విడుదలైన గ్లింప్స్‌లో ప్రత్యేకమైన విజువల్స్, పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమాపై ఆసక్తి పెంచారు. చివర్లో విరాట్‌ను మాస్ అవతార్‌లో పరిచయం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ చిత్రం కేవలం యాక్షన్‌కే పరిమితం కాకుండా బలమైన భావోద్వేగాలతో సాగనుంది. మనిషి తనలోని అపరాధ భావంతో చేసే పోరాటం కథలో కీలక అంశంగా ఉండనుందని తెలుస్తోంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు కొత్త కథా ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. చిరంజీవి నటించిన ‘రుస్తుం’ టైటిల్‌ను విరాట్ ఏ స్థాయిలో నిలబెడతాడో చూడాలి.


మరిన్ని వార్తలు