'టీజేఎస్' మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నూతన కమిటీ నియామకం
అల్వాల్, సెప్టెంబర్ 19,(విజయక్రాంతి): తెలంగాణ జన సమితి (టీజేఎస్ )(Telangana Jana Samiti) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నూతన కమిటీని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ప్రక టించారు. జిల్లా అధ్యక్షునిగా మారం లక్ష్మారెడ్డి, ఉపాధ్యక్షులుగా రెడ్డిపల్లి శ్రీనివాస్, తిరుమల్ రెడ్డి, బర్మోజు వెంకటాచారి, ప్రధాన కార్యదర్శిగా ఏర్పుల దయాకర్, కోశాధికారిగా సుమంత్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా జంగం రవికుమార్, లింగోల దయాకర్ గౌడ్, జాయింట్ సెక్రటరీలుగా గాండ్ల లక్ష్మణ్, పొలమోని బాల శివశంకర్ నియమితు లైనారు. ఈ సందర్భంగా శనివారం వారికి నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా కోదండరామ్ సార్ మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడం, ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం, ప్రజాస్వామ్య పునరుద్ధరణ లక్ష్యంగా ముందుకు వెళ్లాలన్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను అందించడం టీజేఎస్ లక్ష్యమని ఆ దిశగా నాయకులు పని చేయాలని సూచించారు. జిల్లా ఇన్చార్జ్ పల్లె వినయ్ కుమార్ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని ముందుకు తీసుకు పోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అశోక్ రెడ్డి, భద్రకామి ఆంజనేయులు, రాష్ట్ర యువజన విభాగం నాయకులు ఎర్ర వీరన్న పాల్గొన్నారు.