ఎర్రవల్లిలో మూడో రోజూ భూ సర్వే
19-09-2026 | 11:23am
హైదరాబాద్: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి భూముల్లో(Erravelli Land Survey) రెవెన్యూ అధికారులు మూడో రోజు మూడు బృందాలుగా ఏర్పడి సర్వే నిర్వహిస్తున్నారు. శాటిలైట్ ద్వారా నిన్న ఎర్రవల్లి, వెంకటాపూర్, వరదరాజ్ పూర్ లో హద్దులు గుర్తించారు. మూడు గ్రామాల సరిహద్దులోని 325 సర్వే నంబర్ హద్దులను గుర్తించామని అధికారులు(Revenue officials) పేర్కొన్నారు. చెరువులు, గుట్టల హద్దులను ఫిక్స్ చేసి, సర్వే నంబర్ 325లోన అసైన్డ్ భూమి బౌండరీలకి మార్కింగ్ వేసే అవకాశముంది. సర్వేయర్లు సర్వే నంబర్ 325 లోని భూ విస్తీర్ణాన్ని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.